37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

12+12=24 అర్థం తెలుసా? అసలు దీని వెనకున్న పరమార్థమేంటి?

తేదీలో ఏముంది అనుకుంటాం. ఏ రోజుకారోజు తేదీ రాయాల్సి వస్తే.. అలా అప్పటికప్పుడు రాసి పక్కనపడేస్తాం. కానీ, తేదీలో కొన్నిసార్లు చిత్ర విచిత్ర అంశాలుంటాయి. ఊహించని లెక్కలుంటాయి. ఇవాళ తేదీ ఇదేనా? రాసేశామా? పూర్తయ్యిందా? అన్నట్లు సాదాసీదాగా చూసి వదిలేస్తే ఏమీ ఉండదు. కానీ, కాస్త మనసుపెట్టి, అవగతం చేసుకుంటే ఏదో ఓ స్పెషాలిటీ కనిపిస్తుంది. అలాంటి స్పెషాలిటీ ఇవాళ్టిరోజులో కూడా ఉంది.

సరేగానీ, ఇవాళ తేదీ ఏంటో చూద్దాం.. డిసెంబర్‌ 12వ తేదీ. అంటే.. 12వ తేదీ, 12వ నెల. ఏముంది.. ప్రతి యేడాదీ వచ్చేదే కదా? అనుకుంటున్నారా? మరో ఎలిమెంట్‌ కూడా యాడ్‌ చేయండి. ప్రస్తుత సంవత్సరం ఏంటి? 2024. మనం రెగ్యులర్‌గా వాడుకలో రాసేలా చెబితే 24. ఇప్పుడు తేదీ, నెల, సంవత్సరం చూద్దాం. 12వ తేదీ, 12వ నెల, 24 సంవత్సరం. ఈ అంకెలు చూడగానే ఏమైనా స్ఫురించిందా? 12, 12, 24. దీన్ని కాస్త తమాషాగా చూసుకుంటే.. 12ను 12తో కూడితే వచ్చే సంఖ్య 24 అంటే.. ఇవాల్టి తేదీ, ఇవాల్టినెలను కూడితే వచ్చేమొత్తం ఈ సంవత్సరం అన్నమాట. అంటే.. 12+12=24. ఇలాంటి చమత్కారమైనవి ఎప్పుడో ఓసారి గానీ రావు. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త మెదడుకు పనిపెడితే కాస్తంత క్రియేటివిటీ జోడించినట్టవుతుంది. ఇవాల్టిరోజుకు ఓ ప్రత్యేక ఉందని చెప్పుకునేందుకు వీలుంటుంది. కాబట్టి… ఇవాల్టి రోజును అంటే.. 12+12=24ను ఆస్వాదిద్దాం… అరుదుగా వచ్చే ఇలాంటి వాటిని గురించి చర్చించుకుందాం…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com