32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య…

హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోన్న రేణుక నాయక్‌(24) బలవన్మరణానికి ఒడిగట్టింది. హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పక్క గదిలో ఉన్న స్నేహితురాలు గమనించి హాస్టల్‌ సిబ్బందికి చెప్పింది. అందరూ కలిసి రేణుకను కిందికి దించి కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక నాయక్‌ చనిపోయింది.

కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుక కొంతకాలంగా హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ పోటీ పరీక్షలకోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఆమెకు గత నెలలో ఎంగ్గేజ్‌మెంట్‌ అయ్యిందని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి కూడా ఫిక్స్‌చేశారు పెద్దలు. రేణుకకు పెళ్లి నచ్చకపోవడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com