24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

పాలమూరు రైతు పండుగలో నాలుగో విడత రుణమాఫీ

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో జరిగిన ‘రైతు పండగ’ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. రైతులతో భారీ సభను ఏర్పాటు చేయగా… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు కుటుంబాల పంట రుణమాఫీకి 3,13,897 మంది రైతులకు రూ.2747.67 కోట్ల చెక్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను రైతు పండుగ సభావేదిక నుంచి వర్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  ప్రారంభించారు.

ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా… నాల్గో విడతలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపచేశారు. వీరంతా రుణమాఫీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. పలు సాంకేతిక కారణాల రీత్యా వీరికి రుణమాఫీ జరగలేదు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ పూర్తి కావటంతో… వీరికి కూడా మాఫీ చేయాలని సర్కార్ సిద్ధమైంది.

డిసెంబర్ 1 వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగానే ఇవాళ పాలమూరులో రైతన్న సభ నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com