తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. దీంతో, టీజీపీఎస్సీ చైర్మన్ పదవికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్‌గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవాళ్లనుంచి దరఖాస్తులు స్వీకరించింది. నవంబర్ 20వ తేదీ లోగా దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, ఈ పదవికోసం రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఐఏఎస్ అధికారులు దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడపోసి.. బుర్రవెంకటేశం పేరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. గవర్నర్ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు. బుర్రవెంకటేశం నియామకానికి శనివారం గవర్నర్ వర్మ ఆమోదముద్ర వేశారు.