టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
జీబ్రా కంటెంట్ చాలా కొత్తగా వుంటుంది. కామన్ మ్యాన్ గ్యాంగ్ స్టర్ వరల్డ్ లో పడే హార్డిల్స్ ని చాలా ఫన్ ఫుల్ గా డీల్ చేయడం… ప్రేక్షకులు ఇందులో థ్రిల్లర్, ఫన్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. థ్రిల్, కామెడీ అద్భుతంగా బ్లెండ్ అయ్యింది. సిట్యువేషల్ కామెడీ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది.