29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

కోటి దీపోత్సవంలో పాల్గొననున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రాజనాథ్ సింగ్ చేరుకుంటారు. రాత్రి 7.45 గంటల వరకూ బేగంపేట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని పరిశీలించి, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం చేరుకుని కోటిదీపోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. దాదాపు గంట సేపు అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి ఢిల్లీ పయనమవుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com