33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ఆలయ ప్రాంగణంలో పేలుడు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడా రాజస్థాన్ ప్రజాప్రతి శ్రీ శ్రీయాదే మాత మందిరం వద్ద బ్లాస్టింగ్ కలకలం రేపింది. ఉదయం ఆలయం ప్రాంగణంలో పూజారి చెట్లను తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థం బ్లాస్ట్ అయింది.

ఈ ప్రమాదంలో పూజారి సుగుణారాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎసిపి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com