24.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర – సింగర్‌ కల్పన ఆరోపణ

పుష్ప హీరో అల్లు అర్జున్‌ అరెస్టుపై సింగర్‌ కల్పన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా, కుట్రపూరితంగా చేసిన అరెస్ట్‌ అని ఆరోపించారు. సెక్షన్‌ 105 ప్రకారం అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కల్పన ప్రశ్నించారు. థియేటర్‌లో అనుకోకుండా ఓ మహిళ మరణించిన కేసులో సెక్షన్‌ 181ని ఎలా చేరుస్తారని సందేహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర అని ఆమె అభివర్ణించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని కూడా అల్లు అర్జున్‌ ప్రకటించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అసలు ఈ పరిణామానికి థియేటర్ యాజమాన్యం, పోలీసు శాఖ తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోవడమే కారణమన్నారు సింగర్‌ కల్పన. పోలీసులు తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలకు అల్లు అర్జున్‌ ఎందుకు బాధ్యత వహించాలని కల్పన ప్రశ్నించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com