భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూపు సంస్థ యజమాని గౌతం అదానీకి అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయింది. 20 ఏళ్లలో రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు అమెరికాలోని భారత ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు వెలుగు చేశాయి. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగర్ అదానీలకు జడ్జి అరెస్టు వారెంట్ జారీ చేశారు. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం ద్వారా US పెట్టుబడిదారులు, ప్రపంచ ఆర్థిక సంస్థల నుండి నిధులు తీసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని లంచం కోసం వినియోగించారు. అరెస్టు వారెంట్ నేపథ్యంలో.. అదానీ గ్రూపు ఈ రోజు(గురువారం) ఆ ప్రణాళికను రద్దు చేసింది. దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా పెట్టుబడీదారులను, అధికారులను మోసం చేసినట్లు గౌతం అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ ఆ అభియోగాలు చేసింది.