హైదరాబాద్‌లో ఓ సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య కర్నాటకలో విషాదం నింపింది. ఎందుకంటే ఆమె కన్నడ సీరియల్ నటి. కన్నడ సీరియల్ నటి శోభిత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన ఇంట్లోనే ఉరి వేసుకొని శోభిత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శోభిత పెళ్లి తర్వాత నటనారంగానికి దూరమయ్యారు. పెళ్లి చేసుకున్న తర్వాత సీరియళ్లలో ఆమె కనిపించలేదు. అయితే, శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కన్నడలో చాలా సీరియల్స్‌లో శోభిత నటించింది. ఆమె కొన్నాళ్లు యాంకరింగ్ కూడా చేసింది. పెళ్లి తర్వాత శోభిత భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆత్మహత్యకు కారణం తెలియలేదు.
శోభిత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ పోస్టులు పెడుతుంది. ఇన్‌స్టాలో శోభితకు 18 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.