గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులకు సంబంధించి రూపొందించాల్సిన ప్లాన్‌లపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉస్మానియా ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.