37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సన్నీలియోన్‌ సరికొత్త పాత్రలో మందిర – ఈనెల 22న విడుదల

తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు సరికొత్తగా మళ్లీ వస్తోంది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా పలు పాత్రలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో , కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి ఈ సినిమానునిర్మించారు. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఇకపై మందిర టీం ప్రమోషన్స్‌తో సినిమా మీద మరింత హైప్ పెంచేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి జావెద్ రియాజ్ సంగీతం అందించారు. దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా పని చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com