తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీనివాసుడిని తెల్లవారు జామునే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క తిరుమలేశుడి సన్నిధికి వెళ్లారు. గురువారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన భట్టి విక్రమార్క గురువారం రాత్రి తిరుమలలోనే బస చేశారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో్ కలిసి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా సెంటర్లో మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో పోటీ పడాలని, అలాగే, లోక కల్యాణం కోసం స్వామివారిని ఈ సందర్భంగా వేడుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. మధ్యాహ్నానికే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి సచివాలయం వెళ్లారు. సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొన్నారు.