మన దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనది? ఈ పాస్‌పోర్ట్ మన చేతిలో ఉంటే మనకుండే పవర్స్ ఏంటి? సేమ్ ఇలాంటి ఆలోచనలకు జవాబులు ఇచ్చేందుకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ఉండేది. మొత్తం 199 దేశాల పాస్‌పోర్ట్‌లను వడపట్టి.. ర్యాకింగ్‌లు ఇచ్చింది. ఇందులో మన స్థానం 85. మరింత దారుణమైన విషయం ఏంటంటే గతేడాది మన ర్యాంక్ 80. అంటే ఏడాదిలో ఐదు స్థానాలు దిగజారింది మన పాస్‌పోర్ట్ ర్యాంక్.
నిజానికి విదేశాల్లో ట్రావేల్ చేయాలంటే వీసా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఎలాంటి వీసా లేకుండా జస్ట్ పాస్‌పోర్ట్ చూపిస్తే చాలు ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. దాని ఆధారంగానే ఈ ర్యాంక్సింగ్స్‌ను ప్రకటిస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంది.
ఇక ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నది సింగపూర్. ఈ దేశం పాస్‌పోర్ట్ ఉంటే చాలు 195 దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే వెళ్లవచ్చు. సింగపూర్ తర్వాత సెకండ్ ప్లేస్ జపాన్‌ది. ఈ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలను చుట్టేయొచ్చు. ఇక ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలను సందర్శించొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రియా (191), డెన్మార్క్ (191) దేశాలు ఉన్నాయి.
ఈ లిస్ట్‌లో అమెరికా 186 దేశాలతో 9వ స్థానంలో ఉంది. ఇక పాకిస్థాన్ 33 దేశాలతో 103వ స్థానంలో ఉంది. చివరి స్థానంలో అంటే 105వ స్థానంలో 27 దేశాలతో సిరియా ఉంది.