మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 370 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 107, విద్యుత్ శాఖ కు సంబంధించి 80, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 65, ప్రవాసి ప్రజావాణి సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించి 114 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.