ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో నక్సల్ కొరియర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి నుంచి ఓ కలర్ ప్రింటర్, మావోయిస్ట్ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లాలోని బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మావోయిస్టులకు పలు పరికరాలు సరఫరా చేస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. భద్రాచలంలో ఈ కలర్ ప్రింటర్ మిషన్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కూడా నక్సల్స్ కు ఇన్వర్టర్ మిషన్, ఇతర సామగ్రి అందించినట్లు తెలిపారు