దశాబ్దకాలం వరకూ ..హాలీవుడ్ సినిమాలే 1000 కోట్ల క్లబ్ లో నిలిచి ఉండేవి… ఆరికార్డులను షేక్ చేసి సినిమా చరిత్రలో భారతీయ సినిమా దంగల్ వాటన్నిటీనీ సవాల్ చేస్తూ రూ. 2 వేల కోట్లను అధికమించి ప్రపంచం అంతటినీ భారతదేశం వైపు చూసేలా చేసింది… అది ఆరంభం మాత్రమే… ఆతర్వాత ఒకటి తర్వాత ఒకటి రికార్డులపై రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఇండియన్ స్క్రీన్ తమదైన ముద్రవేస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ వేల కోట్ల క్వబ్ లో చేరిన మన భారత సినిమా చరిత్ర ఇదిగో..
దంగల్
భారతీయ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డు ఆమీర్ ఖాన్ దంగల్ పేరు మీదనే ఉంది నితేష్ తివారి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించగా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా
రూ 2వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది
బాహుబలి2: ది కన్ క్లూజన్
దంగల్’ తర్వాత సెకండ్ ప్లేసులో తెలుగు బాహుబలి2 నిలిచింది .దర్శకధీరుడురాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించారు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సుమారు రూ.1800కోట్ల కలెక్షన్లు సాధించింది
ఆర్ఆర్ఆర్
ఇక ఈ జాబితాలో ఉన్న మరో తెలుగు ఆర్ఆర్ఆర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటించారు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ రూ.1390కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది
కెజిఎఫ్2
కన్నడ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన యష్ నటించిన కేజీఎఫ్ దీనికి సీక్వెల్ గా వచ్ఇన కేజీఎఫ్2 ఓవరాల్ గా రూ .1280కోట్ల వసూళ్లు సాధించింది
కల్కి2898ఏడీ
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మరో విజువల్ వండర్ కల్కి 2898ఏడీ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ లో దీపికా పదుకొణె, అమితాబ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు
ఈ వరల్డ్ వైడ్ గా సుమారు రూ .1200కోట్లకు పైగా వసూళ్లు సాధించింది
ఇంతే కాదు మరికొన్ని భారతీయ సినిమాలు సైతం 1000 కోట్లకు పైగా వసూలు చేసి అప్పటి కాలంలో రికార్డులు సృష్టించాయి.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన .జవాన్ .1148కోట్ల వసూళ్లు సాధించింది అంతకు ముందు రిలీజైన కింగ్ ఖాన్ మరో .పఠాన్ కూడా సుమారు రూ .1050కోట్ల వసూళ్లు సాధించింది
ఆరు రోజుల్లోనే రూ1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రం ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ నట విశ్వరూపం
బ్రిలియంట్ అండ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ అత్యద్భుతమైన టేకింగ్మెస్మరైజింగ్ కథ కథనాలు వెరసి పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ సన్సేషన్ కాంబినేషన్లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ఆరు రోజుల్లో రూ1002 కోట్లు వసూలు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
కేవలం ఆరు రోజుల్లోనే రూ1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ ది రూల్ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది బాలీవుడ్లో హిందీలో ఆరు రోజులకు రూ 375 కోట్లు కలెక్ట్ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం ఆరు రోజుల్లోనే రూ375 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్ కైవసం చేసుకున్నారు ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నాడు