తెలంగాణ పోలీసులకు సంబంధించి వివిధ విభాగాల్లోని బ్యాడ్జీలలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో తెలంగాణ స్టేట్ పేరుతో షార్ట్ ఫామ్‌లో ఉన్న బ్యాడ్జీలను తెలంగాణ – టీజీగా మార్పులు చేయాలని నిర్ణయించింది. TSP బ్యాడ్జీలను TGPగా మార్చాలని, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్గా పేర్కొనాలని ఉత్తర్వులిచ్చింది. TSSP బ్యాడ్జీలు, ఇకపై TGSPగా మారతాయి. TSPS బ్యాడ్జీలు ఇక నుంచి TGPSగా మార్చేస్తారు. ఈమేరకు బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.