మణిపూర్ లో సాయుధ మిలిటెంట్లు ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జరిబామ్ ప్రాంతలోని సాయుధ మిలిటెంట్లు ఒకే కుటుంబానికి చెందిన ఆరు మందిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యచేశారు. హత్యగురైన వారిలో ఒక పసికందు, ముగ్గురు మైనర్ పిల్లలు కూడా ఉండటంతో మణిపూర్ ప్రజలు రాష్ట్రం అంతటా భారీ నిరసనలు చేస్తున్నారు. అయితే జరిబామ్ లో కిడ్నిప్ కు గురై హత్యకు గురైన వారిలో మూడు మృత దేహాలు లభ్యం కావడంతో శనివారం ఇంఫాల్ లోయలోని పలు ప్రాంతాల్లో వందలాది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని క్వాకీల్, సగోల్ బాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిరోధించడానికి నిరసనకారులు టైర్లను తగులపెట్టి రహదారులకు అడ్డంగా వేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎక్కవగా మహిళలు పాల్గొనొ ప్రధాన రోడ్లను అడ్డుకుంటున్నారు.