వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహ రిసెప్షన్ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు.
తొలుత అమరావతి నుంచి కడప చేరుకున్న వైఎస్ జగన్.. నేరుగా వివాహ వేడుక జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక సందర్భంగా పెళ్లి వేడుకలో సందడి నెలకొంది. రిసెప్షన్ వేడుకకు హాజరైన వాళ్లు ముఖ్యంగా మహిళలు వైఎస్ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వివాహ వేడుకలో జగన్ పార్టీ నేతలను, అభిమానులను పలకరించారు. ఆ తర్వాత కడప నుంచి వైఎస్ జగన్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు.