ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం వైఎస్ జగన్ తాడేపల్లి లోని తమ నివాసం నుంచి బయలు దేరి శ్రీకాకుళం వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ మోహన్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేరుకుంటారు. ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. రాజశేఖరం కుమారుడు.. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్లనున్న జగన్.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అనంతరం తిరుగు పయనం అవుతారు. సాయంత్రానికి తాడేపల్లి చేరుకుంటారు.
- Advertisement with us -