29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

వైఎస్‌.రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితమిచ్చిన వైఎస్‌.జగన్‌

పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రెండో రోజు బుధవారం వైఎస్‌.రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ఆస్పత్రిని ఇప్పుడు దాదాపు పది కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్సార్‌ ఫౌండేషన్‌ స్ధలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించడం విశేషం. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. నూతనంగా ఆధునీకరించిన వైఎస్‌.రాజారెడ్డి నేత్రాలయాన్ని ప్రజలకు అంకితం చేసిన అనంతరం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆసుపత్రి అంతా తిరిగి అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. తారువాత వైఎస్‌.జగన్‌ అక్కడి వైద్యులతో కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com