29.2 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

డ్రగ్ నియంత్రణకు యువత ముందుకు రావాలి…ఎమ్మెల్యే విజయ్ చంద్ర

డ్రగ్ నియంత్రణకు యువత నడుము కట్టాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా లైన్స్ కళ్యాణమండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం జరిగింది విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి హాజరైనఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొని మాట్లాడారు. మనం ఐదుగురు ధనవంతులతో తిరిగితే ఆరో ధనవంతుడిగా మారతాం నలుగురు పిచ్చోళ్ళతో తిరిగితే ఐదో పిచ్చోడుగా మారతాం, నలుగురు వ్యసనపరులతో పెరిగితే ఐదో వ్యసనపరుడుగా తయారవుతామన్నారు.

ఈ విషయాన్ని గమనించి మంచి వారితో మెలిగేలా శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం డ్రగ్ నిలయంగా మారిందని దానిని తరిమికొట్టేందుకు పోలీసులతో పాటు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. ఏ ఒక్కటి ఉచితంగా రాదని కష్టపడి మంచి మార్గంలో నడిస్తే మంచి జరుగుతుందని ఆయన అన్నారు. డ్రగ్ నియంత్రణకు నేను సైతం అంటూ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి మాధవరెడ్డి అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ ఏఎస్పి అంకిత సురాణా, డీఈవో తిరుపతి నాయుడు క్షయ లెప్పర్సి ఎయిడ్స్ నియంత్రణ అధికారి నియంత్రణ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com