25.1 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

రష్యా ఉక్రెయిన్ వార్… శాంతి కోసం కుంభమేళాలో పూజలు

ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడుతోంది. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు, యాత్రికులతో కుంభమేళా ప్రాంతం కిటకిటలాడుతోంది. తాజాగా  రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసి శాంతి స్థాపన జరగాలని మహా కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రష్యా,ఉక్రెయిన్ రెండు దేశాలకు చెందిన ప్రజలు ఈ ప్రార్థనల్లో పాల్గొనటం విశేషం.

జునా అఖాడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రెండు దేశాల్లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ప్రయాగరాజ్ లో జునా అఖాడా(మఠం) చీఫ్ మహామండలేశ్వర్ విష్ణుదేవానంద్ బాబా ఆధ్వర్యంలో శాంతి స్థాపన పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ…రష్యా , ఉక్రెయిన్ దేశాల ప్రజలు మహా కుంభమేళా నెలా నుండి శాంతి కోరుకుంటున్నారని తెలిపారు.

బాబా వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….

త్రీవేణి సంగమం ఇసుక మీద కూర్చుని శివుడిని స్తుతిస్తున్న రెండు దేశాల పౌరులు ఆయురారోగ్యాలతో
శాంతి కామకుల్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంగం ఇసుకపై జరిగిన గొప్ప సమావేశంలో ప్రతి క్షణం ప్రత్యేకమైనది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటిoచేది భారతీయులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా శాంతిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు.

రెండు శత్రు దేశాల పౌరులు కలిసి కూర్చుని శాంతి కోసం ప్రార్థించినప్పుడు, ఇది మహా కుంభ మేళా యొక్క గొప్ప సంగమం అని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలి. ప్రతి రోజు మహామండలేశ్వర్ స్వామి విష్ణుదేవానంద శిబిరంలో( ఆశ్రమంలో)శ్రీ పంచదశ్నం జునా అఖాడా గిరి ఇలా ఉంటుంది.
భక్తులు శివుని స్తుతిస్తూ కీర్తనలు పాడటంలో బిజీగా ఉంటారు.. సంస్కృత శ్లోకాలతో పూజలు జరుగుతాయి.

ప్రత్యేకత ఏమిటంటే, రష్యా ఉక్రెయిన్ శత్రువులైన రెండు దేశాల పౌరులు ఇక్కడ చేతులు జోడించి కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇక్కడ మనం రష్యా, ఉక్రెయిన్ గురించి మాట్లాడుతున్నాము, వారి యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించినప్పటికీ, మీరు చూస్తున్న ఈ వ్యక్తులు రష్యా ఉక్రెయిన్ నుండి వచ్చి కలిసి భజన కీర్తన పూజలు చేస్తున్నారు.

ఇక్కడ(ప్రయాగ్ రాజ్) రెండు దేశాల మధ్య యుద్ధం, శత్రుత్వం యొక్క ప్రభావం లేదు, వారు దైవ చింతన గురించి మాత్రమే అలోచిస్తున్నారు. సంగమం పరిసరాల్లో,ఒడ్డున, పూర్తిగా సనాతన ధర్మ రంగులతో పెయింట్ చేయబడ్డాయి. మనం యుద్ధం గురించి కాదు, దేవుని గురించి మాట్లాడాలీ.

మహా కుంభమేళా అనేది ఒక ఆధ్యాత్మికత క్షేత్రం. ఆధ్యాత్మికత ఉన్నచోట యుద్ధాలు ఉండవని అందరూ గుర్తించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com