-
మెక్సికో తీరంలో డూమ్స్ డే ఫిష్ ప్రత్యక్షం
-
భయంతో వణుకుతున్న జపనీయులు
-
ప్రమాద సూచికగా భావించే చాలా మంది
-
సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
ఈనెల 9న కనిపించిన ఈ అరుదైన చేప
-
ఇది విపత్తులను సూచించే మత్య్సకన్యగా భావన
-
ప్రమాదాన్ని హెచ్చరించే దైవదూతగా జపనీయుల నమ్మకం
-
గతేడాది వేర్వేరు చోట్ల ప్రత్యక్షమైన మూడు ఓర్ ఫిష్‌లు
-
వీటిలో ఒకటి 125 ఏళ్ల తర్వాత కనిపించిన వైనం
ప్రపంచాన్ని మరో పెను విపత్తు కబళించనుందా? ఓ పర్యావరణ ప్రమాదం మన ముంగిట్లో పొంచి ఉందా? రాబోయే అతిపెద్ద విపత్తుకు అది తొలి సంకేతంగా దర్శనమిచ్చిందా?
మెక్సికో సముద్ర తీరంలో డూమ్స్ డే ఫిష్గా పిలవబడే ఓర్ ఫిష్ ఒకటి బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.సాధారణంగా ఎప్పుడూ కనిపించని ఈ అరుదైన సముద్ర జాతి చేప ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. జపనీయులు ఈ చేప కనపడటం చెడుకు సంకేతంగా భావిస్తారు. రానున్న పెను విపత్తులకు ఇదొక హెచ్చరిక లేదా ముందస్తు సూచన లాంటిదని భావిస్తూ ఉంటారు.సాధారణంగా పెను భూకంపాలు, లేదా ఇతర ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని ముంచెత్త బోతున్నాయని అది సూచకంగానే ఈ చేప సముద్రపు ఒడ్డుకు ఒచ్చి కనిపించిందని చెబుతున్నారు.
ఈ అరుదైన చేపలు సముద్ర గర్భంలో చాలా అట్టడుగున ఉంటాయి. ఎన్నడూ బయటకే రావు. ఇప్పటి దాకా ఎవరికీ కనపడలేదు కూడా.. అలాంటిది ఇప్పుడు బయటకు ఈదుకుంటూ రావడం అంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.
చెడుకు సంకేతమా? :
సన్నగా లేత నీలం రంగులో పొడుగ్గా రిబ్బన్ షేప్‌లో ఉన్న ఈ చేప పర్యావరణ విపత్తులకు సంకేతంగా జపాన్ దేశస్తులు భావిస్తారు.ఆక్యూవెదర్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ చేప మెక్సికో బీచ్‌లో ఈనెల 9వ తేదీన ఒడ్డుకు కొట్టుకు వచ్చిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా వేగంగా కదులుతూ ఒడ్డుకు చేరిన ఆ చేపను సమీపంలో ఉన్న బ్యాచిలర్లు వింతగా చూశారు. ఒడ్డుకు వచ్చిన ఆ చేప కాసేపటికి చలనం కోల్పోయి కనిపించింది. దాంతో.. వారే దానిని తిరిగి సముద్రంలోకి నెట్టేశారు. అసలిలాంటి చేపలు బయట పడవు. ఇప్పటి వరకూ ఎన్నడూ కనిపించలేదు కూడా. ఇదే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది.
125 ఏళ్ల తర్వాత దర్శనం :
గత ఏడాది 2024లో దక్షిణ కాలిఫోర్నియాలో వేర్వేరు చోట్ల ఈ ఓర్ జాతి చేపలు మూడు కనిపించాయి. వీటిలో ఒకటి శాంటియాగోలో కనిపించింది. శాంటియాగోలో కనిపించిన ఈ జాతి చేప అత్యంత అరుదైనది. దాదాపు 125 ఏళ్ల క్రితం తొలిసారి ఈ రకం చేప దర్శనమిచ్చింది. అయితే, ఈ మూడు చేపలు ఒడ్డుకు వచ్చాక చనిపోయాయి.
సముద్రుడు సందేశం పంపాడా? :
డూమ్స్ డే ఫిష్ లోతైన సముద్రపు అలలలో కనిపించడం అంటే రానున్న విపత్తుకు ముందస్తు హెచ్చరికగా చాలా మంది భావిస్తారు. 17వ శతాబ్దంలో ఇలాంటి చేప కనిపించిన తర్వాత జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. జపనీయులు దేవుడుగా ఆరాధించే ర్యూజిన్ అనే సముద్ర దేముని మత్య్స కన్యగా భావించే ఈ చేప ఆయన పంపిన దూతగా ముందస్తు హెచ్చరిక చేయడానికే ఇలా దర్శనమిస్తుంటుందని జపాన్ సాధారణ జనం విపరీతంగా నమ్ముతారు. ర్యూజిన్ అని పిలిచే సాగర దైవానికి సముద్ర గర్భంలో ఒక ఆలయం ఉందని.. అక్కడ ఉండే ఈ అరుదైన నీలిరంగు చేప ప్రమాదాన్నిసూచించడానికి దేవ దూతలా ఇలా బయటకు వచ్చి ఒక సూచికగా కనిపిస్తుందని, ఆ దైవమే ఇలా పంపుతాడని నమ్ముతారు. ఇది భారీ భూకంపం రాబోతోందని హెచ్చరించినట్లేనని జపనీయులు భావిస్తారు.
సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే…
అరుదైన ఈ డూమ్స్ డే ఫిష్ లేదా ఓర్ ఫిష్ గతేడాది ఇలా ఒడ్డుకు వచ్చి చనిపోవడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒడ్డుకు వచ్చి చనిపోయిన ఈ మూడు చేపలు ఒక్కో దాని తీరు ఒక్కోలా ఉందని, వాటి అధ్యయనంలో కూడా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయనీ అంటున్నారు. ఈ మూడు చేపల కదలికలు భిన్నంగా, వాటి స్వభావం కాస్త వేర్వేరుగా కనిపించిందని ఎల్‌నినో, లానినో లాంటి ప్రకృతి పరమైన మార్పులకు సంబంధించిన తేడాలు కూడా వాటిలో కనిపించాయని, తాజాగా కనిపించిన ఈ చేప పర్యావరణ మార్పులను తట్టుకుని ఎలా మనుగడ సాగించిందన్నది కూడా ఆశ్చర్యం కలిగించిందని వారంటున్నారు.