36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

కోహ్లీ క్యా హోగయా… అరే…మళ్ళీ అదే అవుటా…!

  • నెట్టింట జోరుగా చర్చ
  • అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఆడలేక కింగ్ బెంబేలు

కెప్టెన్ రోహిత్ శర్మని పక్కన పెట్టినా సరే, టీమ్ ఇండియా పరిస్థితి ఏమీ మారలేదు. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో పరిస్థితి విషమంగానే ఉంది. అందరూ మళ్ళీ ఎప్పటిలాగే చాప చుట్టేశారు. ఇప్పుడు ప్రశ్న.. విరాట్ కోహ్లీ పైకి మళ్ళింది. రోహిత్ శర్మ ని పక్కన పెట్టినట్టే.. కోహ్లీకి ఉద్వాసన తప్పదని అంటున్నారు. ఇంతటి సీనియర్ ప్లేయర్, టన్నులకొద్దీ పరుగులు తీసి, క్రికెట్ రారాజుగా పేరున్న కోహ్లీ ఇలా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించలేక ఆపసోపాలు పడుతున్నాడు.

పాత సంగతులన్నీ పక్కన పెట్టినా బీ ఎస్ జీ సిరీస్ లో 8 ఇన్నింగ్స్ లో 7 సార్లు ఇదే తరహాలో అవుట్ కావడంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. 2024 తర్వాత…టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి చెత్త సగటు నమోదు చేశాడు. ఇది కోహ్లీ కేరీర్ లోనే అత్యంత వరస్ట్ ఇయర్ గా నమోదైంది.

వివరాల్లోకి వెళితే…2024 తర్వాత టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో 5 కన్నా ఎక్కువ సార్లు చెత్త సగటు నమోదు చేశాడు. ఒకసారి ఇతర బ్యాట్స్ మెన్ల సగటు చూస్తే, వారి సరాసనా విరాట్ ఉన్నాడని ఆశ్చర్యం వేస్తుంది. సిగ్గుగా కూడా ఉంటుంది.

ఇంతకీ అతి తక్కువ సగటు నమోదు చేసిన వారిలో…
5.4 – కేశవ్ మహారాజ్
7.0 – విరాట్ కోహ్లీ
8.0 – జస్ప్రీత్ బుమ్రా
8.3 – షోయబ్ బషీర్
ఉన్నారు. వీరందరూ బౌలర్లే అనే సంగతి తలచుకుంటే…
సగటు భారతీయ క్రికెట్ అభిమానిగా ఎంతో బాధగా కూడా ఉంటుంది…

బతికి బాగుండి, ఏమైనా టీమ్ ఇండియా బౌలింగ్ ఇరగదీస్తే తప్ప… భారత్ ని ఓటమి నుంచి తప్పించడం దేవుని తరం కాదు. రెండో ఇన్నింగ్స్ లో కూడా కోహ్లీ ఇలాగే అవుట్ అయితే రోహిత్ తో పాటు తను కూడా రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని నెట్టింట డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com