వందేళ్ళలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అమెరికాలో మంచు కురుస్తోంది. దీంతో ఆదేశంలోని చాలా రాష్ట్రాలు గడ్డ కట్టుకుపోతున్నాయి. విపరీతమైన ఈచలి దెబ్బకు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఎంతలా అంటే ఇప్పుడు అమెరికాలోని అనేక రాష్ట్రాలలో వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టొదని ఏకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయయ్యారు.
పదేళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. కన్సాస్, నెబ్రాస్కా, ఇండియానాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లన్ని మంచుతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డుపై 8 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంది.
చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీస్‌లు మూతపడ్డాయి. వేలాది విమానాలు రద్దయ్యాయి. ఇక ఆలస్యంగా నడిచే విమానాల సంఖ్య దీనికి పదింతలుగా ఉంది. నార్త్ అమెరికాలోని కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కన్సాస్, అర్కన్సస్, మిస్సోరీ రాష్ట్రాల్లో ఇప్పటికే వెదర్ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. లూయిస్ వ్యాలీ, కెంటకీలో 7.7 అంగుళాల మంచు కురిసింది. ఈ స్థాయిలో మంచు కురిసి వందేళ్ల రికార్డును చెరిపేసింది. లెక్సింగ్ టన్ ప్రాంతంలో కూడా 5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.
మంచు తుఫాన్ మరింత విజృంభించబోతుందని ఇపప్కటికే అధికారులు అన్న్సాని ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. మిస్సోరీలో అయితే ప్రజలను ఇండ్అల నుంచి అసలు బయటికి రావొద్దని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మిన్నెసోటాలోని కెనడా సరిహద్దుల్లో అయితే మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.