విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథ ఎంచుకున్నారు. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి, జూలై 4న ‘కింగ్‌డమ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది.