29.2 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

“వీడీ 12” టైటిల్, టీజర్ ఈ నెల 12న రిలీజ్

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబో క్రేజీ మూవీ “వీడీ 12” టైటిల్, టీజర్ ఈ నెల 12న రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే “వీడీ 12” సినిమా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ రోజు మేకర్స్ “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 12వ తేదీన “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు ‘ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..’ అని రాసిన క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మెమొరబుల్ మూవీని అందించేందుకు “వీడీ 12” టీమ్ శ్రమిస్తోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడక్షన్ డిజైన్ – అవినాష్ కొల్ల
ఎడిటింగ్ – నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ – జామొన్ టి జాన్, గిరీష్ గంగాధరన్
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
సమర్పణ – శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్ – సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు – నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం – గౌతమ్ తిన్ననూరి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com