30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

లేటుగా వచ్చినా లేటెస్ట్ ఆటగాడు…వరుణ్ చక్రవర్తి

అదృష్టం అంటే అదే… అసలు ఒరిజినల్ గా ఛాంపియన్ ట్రోఫీ టీం కి సెలెక్ట్ కాలేదు… టి20 బౌలర్ అంటూ సెలెక్ట్ కూడా చేయలేదు. ఇంగ్లాండ్ తో జరిగిన ఆటలో మంచి ప్రతిభ కనబరచడంతో చివరి నిమిషంలో ఛాంపియన్ ట్రోఫీ కి సెలెక్ట్ చేశారు.. మొదటి రెండు మ్యాచ్లు ఆడలేదు… అలా అని అధైర్య పడకుండా మూడో మ్యాచులో వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకొని అద్భుతంగా రాణించి.. న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్స్ లో కూడా వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉందని టీం మేనేజ్మెంట్ వర్గాలు అంటున్నాయి…

వరుణ్ చక్రవర్తి 33 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేశాడు. ఈ వయసుకొచ్చేసరికి సాధారణంగా క్రికెటర్లు పీక్ కెరీర్ చూసి ఉంటారు. కానీ వరుణ్ లేట్ గా అయినా లేటెస్ట్ గా వన్డేల్లో అడుగుపెట్టాడు. ఫరూఖ్ ఇంజినీర్ (1974లో 36 ఏళ్ల 138 రోజులు) తర్వాత వన్డే అరంగేట్రం చేసిన భారత పెద్ద వయస్సు ఆటగాడు వరుణే.

కర్ణాటకలో పుట్టి దేశవాళీల్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న లెగ్ స్పిన్నర్ వరుణ్ 2021లో అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ లో కేకేఆర్ తరపున అదరగొట్టి టీమ్ఇండియా ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటివరకూ 18 అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్ 14.57 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ మధ్యలో తడబడ్డా అతను.. సుమారు మూడేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు.
తన బౌలింగ్ ను అడ్జస్ట్ చేసుకుని సరికొత్తగా వరుణ్ తిరిగొచ్చాడు. ఓవర్ స్పిన్, టాప్ స్పిన్ తో బ్యాటర్లను బుట్టలో వేసుకుంటున్నాడు. 2024 అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో టీ20తో పునరాగమనం చేసినప్పటి నుంచి వరుణ్ చెలరేగిపోతున్నాడు. వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. ఆ సెన్సేషనల్ బౌలింగ్ తోనే ఇప్పుడు వన్డేల్లోకి కూడా వచ్చేశాడు. లేటుగా వచ్చినా లేటెస్టుగా ఆడుతున్నాడని వరుణ్ కు అభిమానులు జేజేలు పలుకుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com