25 రోజులుగా వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడిన గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మృత్యువుతో పోరాడి ఓడింది. కుమ్రంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైంది. శైలజ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. 25 రోజులుగా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శైలజ(16) ఇవాళ మృతి చెందింది.
గిరిజన విద్యార్థని శైలజ మరణం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హత్య అని విపక్షాలు ఆరోపించాయి. భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమని బీ ఆర్ ఎఎస్ నేత కేటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.