27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

డాకు మహారాజ్ ఐటం గర్ల్

ఊర్వశీ రౌటేళా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష చిత్రాల్లో నటించింది. బాల నటిగా మళయాలంలో మొదటి సినిమా చేసింది.బాలయ్య సరసన డాకుమహారాజులో నటించిన ఊర్వశీ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2013లో రొమాంటిక్ కామెడీ చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్‌తో సన్నీ డియోల్, అమృతరావుతో కలిసి ఊర్వశీ నటించింది.  వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించింది.

సినిమాల్లో ఊర్వశి కనిపించే సన్నివేశాలు, పాటలలో హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తన నృత్యంతో యూత్ మనసు దోచుకుంది.

ఊర్వశి యో యో హనీ సింగ్ తో పాటు అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్లో కనువిందు చేసింది. ఇది 2014 అక్టోబరులో విడుదలైంది. దక్షిణ భారత దేశంలో అన్ని భాషల ప్రేక్షకులను ఊర్వశి మెప్పించింది.

సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజులో ఐటం సాంగ్ చేసి అదరగొట్టింది. నందమూరి బాలకృష్ణకు  ధీటుగా స్టెప్పులేసింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఊర్వశీ చేసిన పాటపై అధికంగా అంచనాలు ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com