26.8 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఇంట్రెస్టింగ్ విషయాలు..

మూడేళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్ -రష్యా యుద్ధం. ఇప్పుడీ యుద్ధానికి బ్రేక్‌లు వేయాల్సిందేనని చూస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఆర్థిక భారం, రెండోది.. ఈ యుద్ధాన్ని ఆపి శాంతి దూతగా నిలవాలన్న ట్రంప్ తాపత్రయం. ఒక్కసారి అమెరికా ఆర్థిక, సైనిక, నిఘా సాయం ఆపేస్తే యుద్ధం ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. ఇప్పటికే అమెరికా, రష్యాలు చర్చలు ప్రారంభించాయి. కొనసాగిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలకు ఓకే అన్నారు. కానీ కొన్ని కండిషన్స్ పెట్టారు.

అయితే ఇలాంటి సమయంలో కొన్ని కీలక ఘటనలు జరుగుతున్నాయి. అవే ఇప్పుడు ఈ యుద్ధం ఆగకూడదని కొందరు కోరుకుంటున్నట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. అది కూడా శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో. ఈ డ్రోన్ దాడిలో 10 టార్గెట్లు పెట్టుకొని వాటిపై డ్రోన్లతో విరుచుకపడింది. ఈ దాడిని తాము విజయవంతంగా అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. కానీ ఇది రెచ్చగొట్టే చర్య అని క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. రష్యా మాత్రం ప్రతిదాడి చేస్తే ఈ చర్చలన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ రష్యా ఇంకా ఎలాంటి ప్రతిదాడి చేయకుండా సంయమనం పాటిస్తోంది. అంటే ఈ యుద్ధం ఆగడం రష్యాకు ముఖ్యమని అర్థమవుతోంది.

ఇదే సమయంలో మరో కీలక ఘటన జరిగింది. అమెరికా అణ్వాయుధాలను తమ దేశంలో మోహరించాలంటూ పొలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డూడా రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ అభ్యర్థనను కొట్టిపాడేసింది అమెరికా. నిజానికి ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్నదే ఎక్కడ ఉక్రెయిన్ NATOలో చేరి తమ భద్రతకు భంగం కలిగిస్తుందో అని. ఇలా అణ్వాయుధాలను మోపి రష్యా మెడపై కత్తి పెడతారన్న ఆందోళన రష్యాది. సరిగ్గా ఇదే సమయంలో అదే చేయాలని పోలాండ్ కోరడం ఇక్కడ హైలేట్.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఈ శాంతి ఒప్పందం అనే కాన్సెప్ట్ నచ్చడం లేదు. తమ దేశానికి ప్రపంచ దేశాలు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తే రష్యాపై యుద్ధం చేస్తాననే ఇప్పటికి కూడా చెబుతున్నారు. ఇప్పుడు పుతిన్ పెట్టిన కండిషన్స్ అస్సలు నచ్చలేదని.. కానీ ఈ విషయం ట్రంప్‌ కు చెప్పే ధైర్యం లేదంటూ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఈ డీల్‌కు మేం ఒప్పుకోవడం లేదు.. అమెరికా బలవంతం వల్లే ఇదంతా చేయాల్సి వస్తుందన్నట్టుగా ఆయన చెప్పకనే చెబుతున్నారు.

మొత్తానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య సమీకరణలు మారుతున్నాయనేది వాస్తవం. ఈ మధ్య ట్రంప్ నోట పుతిన్ నామస్మరణ పెరిగింది. అదే సమయంలో ఈయూ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొనడం తగ్గించాలని ఇప్పటికే ఈయూ నిర్ణయం తీసుకుంది. మరి ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com