27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

టర్కీ కంపెనీకి అన్ని ఎయిర్ పోర్టుల్లో సెఫ్టీ క్లియరెన్స్ రద్దు

  • పాకిస్థాన్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన టర్కీ
  • ఆయుధాలు,పరికరాల సరఫరా
  • డ్రోన్‌ దాడులకు ఊతమిచ్చింది టర్కీయే
  • టర్కీ టూరిజం ఆదాయంలో సింహభాగం మన పుణ్యమే
  • దాదాపు 12 శాతం ఆదాయం టూరిజం ద్వారానే
  • శతృదేశానికి ఆయుధాలిచ్చిన టర్కీ
  • టర్కీ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
  • ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌ సర్వీస్ క్లియరెన్స్ రద్దు

దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానయాన శాఖ విమానాశ్రయాల్లో టర్కీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అనుమతులు రద్దు చేసింది.సెలెబీ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విమానాశ్రయాల్లో సర్వీస్ చేసేందుకు క్లియరెన్సులను నిలిపివేశారు. ఆపరేషన్ సిందూర్ తదనతర పరిణామాల్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ టర్కీ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ బిజినెస్ ఉంది. 9 ప్రధాన విమానాశ్రయాల్లో ఈ డ్యూటీని సింహభాగం ఈ సంస్థే నిర్వహిస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో టర్కీ పాకిస్థాన్ కు మద్దతు పలకడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్సును తక్షణం రద్దు చేస్తున్నట్లు పౌర విమానయానశాఖ ప్రకటించింది.సెలెబీ సంస్థతో ఢిల్లీ ఎయిర్ పోర్టు కూడా సంబంధాలు రద్దు చేసుకుంది. అక్కడ సెలెబీ ఢిల్లీ- కార్గొ టెర్మినల్ మేనేజమెంట్ ఇండియా,ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్సీస్ కార్గొ సర్వీసులను నిర్వహిస్తోంది.గత కొన్నేళ్లుగా టర్కీ శతృదేశాలతో సంబంధ బాంధవ్యాలు నెరిపిన కేంద్రం ఇప్పుడు టర్కీపై నేరుగా రియాక్ట్ అయ్యింది. సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు పట్ల సెలెబీ ఏవియేషన్ సంస్థ స్పందించింది.తమది విశ్వవ్యాప్తంగా ఉన్న కంపెనీ అనీ దాదాపు 65 ఏళ్లుగా ఏవియేషన్ రంగంలో సేవలందిస్తోందని కార్గో ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తోందని మూడు ఖండాల్లో, ఆరు దేశాల్లో తమ కేంద్రాలున్నాయనీ పేర్కొంది.

అది తప్పుడు నిర్ణయం

తమకు సెక్యూరిటీ క్లియరెన్సు రద్దు చేయడాన్ని ఆ సంస్థ తప్పుబట్టింది తమది ఇక్కడ భారతీయ కంపెనీకిందే లెక్క అనీ, చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టామని, ఉద్యోగులుగా ఇండియన్స్ నే తీసుకున్నామని అంటోంది.తమది టర్కిష్ సంస్థ ఎంత మాత్రం కాదని గ్లోబల్ కార్పొరేట్ ప్రమాణాలనే తామూ పాటిస్తున్నామని, పారదర్శకత, తటస్థ విధానాలతో ఏ రాజకీయ పార్టీతోనూ లింక్ అప్ అయి లేమని వివరించింది. విదేశీ ప్రభుత్వాలతో కానీ, వ్యక్తులతో కానీ తమకు ఎలాంటి సంబంధాలు లేవని సెలెబీ సంస్థ తెలిపింది. ఇక టర్కీ, అజెర్ బైజాన్ సంస్థలు పాకిస్థాన్ తో ట్రేడ్,బ్యాంకింగ్, టూరిజం రంగాల్లో వ్యాపార లావాదేవీలున్నాయి.ఈ మూడు దేశాలు మిలటరీ పరంగా ఒకరిపై ఒకరు ఆధారపడతారు.

మరీ ఘోరంగా బహిరంగ మద్దతు

ఈసారి టర్కీ పాకిస్థాన్ కు బహిరంగ మద్దతు ఇవ్వడమే కాదు ఆయుధాలను కూడా సరఫరా చేసింది. ఈనెల 8న భారత్ లో కీలక నగరాలపై పాకిస్థాన్ చేసిన ద్రోణ్ దాడుల్లో ఎక్కువ టర్కీ సప్లయ్ చేసిన ఆయుధాలే.పెహల్గాం దాడుల తర్వాత ఆపరేషన్ సిందూర్ కు ముందు టర్కీ యుద్ధనౌక ఒకటి కరాచీ పోర్టులో ఆగడం, ఆపై మరో యుద్ధవిమానం ల్యాండ్ కావడం చూస్తుంటే టర్కీ వ్యూహాత్మకంగా కావాలనే ఇలా వ్యవహరిస్తోందని అర్ధమైంది.ఈ పరిణామాలపై మండి పడుతున్న నెటిజన్లు, టూరిస్టులు బాయ్ కాట్‌ టర్కీ ఉద్యమంతో అడుగులేస్తున్నారు. ఆదేశంతో అన్ని వ్యాపార లావాదేవీలను తుంచేసుకుంటున్నారు. టర్కీ విద్యాసంస్థలతో టై అప్ ప్రోగ్రాములను కూడా రద్దు చేశారు. ట్రావెల్ వెబ్ సైట్లు టర్కీ ఫుడ్ ఆర్డర్లను కూడా నిషేధిస్తున్నాయి.టూరిజం ద్వారా 12 శాతం ఆదాయం పొందుతున్న టర్కీకి ఈపరిణమాలు తీవ్రమైన దెబ్బ. ఆలిండియా ట్రేడర్స్ సమాఖ్య కూడా టర్కీతో వ్యాపార లావాదేవీలను రద్దు చేసుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com