29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

టీటీడీలో పాలక మండలి వర్సెస్‌ ఉద్యోగులు – నరేష్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి సభ్యుడు చేసిన వివాదం పెను దుమారానికి కారణమైంది. ఎప్పుడు లేని విధంగా టీటీడీ పాలకమండలి వర్సెస్ టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదం రాజుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి మహాద్వారం నుంచి కేవలం ప్రత్యేక హోదాలో ఉన్న వారికే అనుమతి ఉంటుంది. నేరుగా మహాద్వారం నుంచి వెళ్లే అవకాశం.. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో సహా కొంతమందికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు కాకుండా ఇతరులు ఎవరైనా వైకుంఠం 1 నుంచి… సుపథం మీద లేదా బయోమెట్రిక్ నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. ఇది టీటీడీ నిబంధన. కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక వ్యక్తులను దర్శనం అనంతరం ఆలయం నుంచి మహాద్వారం గేటు ద్వారా బయటకు పంపుతుంటారు. ఇది రూల్ ఏమీ కాదు. ప్రత్యేక వ్యక్తులు,వారికి కావాల్సిన వారు, వీఐపీలు, ఉద్యోగులు, ఇలా ఎవరిని పంపాలని రూల్ లేదు. కాని కొన్ని సంవత్సరాలుగా ఇలా పంపుతూ వచ్చారు.

సాధారణ భక్తులను ఆలయం నుంచి బయటకు ఎడమ వైపు నుంచి బయటకు వస్తారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వీఐపీలు ప్రతి రోజు ఉంటారు. ఇలా వచ్చేవారు మహాద్వారం గేటు తీయించి గోపురం వచ్చేలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాధారణ భక్తులు సైతం ఇలా వచ్చి ఫొటోలు తీసుకునే వాళ్లు. అయితే, భక్తుల రద్దీ విపరీతకంగా పెరిగిపోవడంతో ఆలయం ముందు నిలబడి ఫొటోలు తీసుకునేందుకు సామాన్య భక్తులకు నిరాకరించారు. వీఐపీలకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరిని అటువైపు పంపడం లేదు. ఆలయ మహాద్వారం గేటు నుంచి బయటకు వచ్చి అలవాటుగా ఆలయం ముందు ఫొటో సెషన్స్‌కు కేటాయించుకోవడంతో రద్దీ నెలకొంటుంది. ఇటీవల కాలంలో కొంత మంది వీఐపీలు ఫొటో షూట్‌లు చేయడం కూడా వివాదాలు మొదలయ్యాయి. ఆలయం ముందు ఇలాంటివి చేయడంతో మహాద్వారం గేటు నుంచి ఎవరిని అనుమతించొద్దని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయన కూడా అందరు భక్తులు వెళ్లే మార్గంలో రాకపోకలు చేస్తున్నారు. వీఐపీలు కొందరు వచ్చినప్పుడు ఆ గేటు తియ్యక తప్పడం లేదు. మీడియాను ఆలయం నుంచి దూరం పెట్టడానికి కూడా దీన్ని యూజ్ చేసుకున్నారని ఆరోపణ ఉంది.

కర్నాటకకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో స్వామి దర్శనం కోసం వచ్చారు. వైకుంఠం మీదుగా ఆలయంలోకి ప్రవేశించి తిరిగి మహాద్వారం గేటు వద్దకు చేరుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీని గేటు తీయాలని సూచించారు. ఆయన సున్నితంగా ఇటు వైపు అనుమతి లేదు.. ఈ వైపు వెళ్లాల్సిందిగా తెలిపారు. నేను బోర్డ్ మెంబర్ గేటు తియ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి సైతం కొంత ఆగ్రహంతో మాకు ఎవరిని పంపకండి అని చెప్పారు సార్. అటువైపు వెళ్లండి అన్నారు. దీంతో నరేష్ కుమార్ కోపంతో ఉద్యోగిపై బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. ఆలయంలో ఉన్నానన్న విచక్షణ కూడా లేకుండా ఉద్యోగిపై బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న టిటిడి విజిలెన్స్ అధికారిని పిలిచి ఉద్యోగిని బయటికి పంపే వరకు ఊరుకోలేదు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఊరుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత టీటీడీ విజిలెన్స్ అధికారులు గేటు తీసి బయటకు వచ్చినా కూడా ఆగ్రహంతోనే ఉన్నారు.

ఈ సంఘటన మొదటిదేమీ కాదు.. మీడియా అక్కడే ఉండగా ఈ విషయం జరగడంతో వెలుగులోకి వచ్చింది తప్ప తెలియకుండా ప్రతిరోజు ఇది వివాదం వీఐపీలు… ఉద్యోగుల మధ్య జరుగుతూనే ఉంది. విధుల్లో ఉన్న ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును టీటీడీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు ఇలా వ్యవహరించడంతో ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరేసారు ఉద్యోగులు. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని అంటున్నారు. లేకపోతే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. వామపక్ష సంఘాలు సైతం బోర్డు సభ్యుడి తీరును తప్పుబడుతున్నాయి. ఈ వివాదంపై టీటీడీ అధికారులు, ఛైర్మన్ ఎవ్వరూ మాట్లాడడం లేదు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com