26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

మాడ వీధుల్లోని గ్యాలరీలలో టిటిడి ఈవో పరిశీలన

రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మంగళవారం ఉదయం టిటిడి ఈవో జె.శ్యామల రావు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉదయం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు తదితర సౌకర్యాల అందాయా లేదా అన్న విషయాన్ని భక్తులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి క్రమంగా అన్నప్రసాదాలు అందుతున్నాయని భక్తులు ఈఓ శ్యామలరావు వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఈఓ ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహన సేవల విరామ సమయాల్లో గ్యాలరీలను శుభ్రం చేసి హైజనిక్‌గా ఉంచాలని టీటీడీ అధికారులను ఈఓ ఆదేశించారు. గ్యాలరీలలో ఉన్న వివిధ ప్రాంతాల భక్తులతో మాట్లాడారు. భక్తులు ప్రశాంతంగా వాహన సేవలను వీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com