36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ట్రంప్ కొత్త వ్యాపార సూత్రం… ట్రంప్  గోల్డ్ కార్డ్

  • అమెరికా సిటిజన్ షిప్ కు ఇదే ఎంట్రీ కార్డ్
  • EB-5 ఇమ్మిగ్రంట్‌ ఇన్వెస్టర్ వీసా రద్దు
  • దాని స్థానంలో గోల్డ్ కార్డు వీసా
  • దాని ఖరీదు 43,52,98,911 రూపాయలు
  • ఇది అమెరికాలో ఉపాధికల్పనకు పెట్టుబడుల మార్గం
  • పాత EB-5 వీసా విధానం చెత్తదని కామెంట్‌
  • సంపద సృష్టికి ఇదే మార్గమంటున్న ట్రంప్‌
  • రష్యా రాజ్యాధిపతులకూ ఛాన్స్

మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో ఆడుకోటం మొదలెట్టారు. బర్త్ రైట్‌ సిటిజన్‌ షిప్‌ రద్దు చేసి ఇమ్మిగ్రెంట్లకి చుక్కలు చూపిస్తున్న ట్రంప్‌  ఇప్పుడు గోల్డెన్ వీసా పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. ప్రస్తుతం అమలులో ఉన్న  EB-5 ఇమ్మిగ్రంట్‌ ఇన్వెస్టర్ వీసాను రద్దు చేసి దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారు. ఎవరైనా అమెరికాలో సిటిజన్‌ షిప్‌   తీసుకోవాలంటే ఈ గోల్డెన్ వీసా తప్పనిసరి. దాని ఖరీదు 5మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 43,52,98,911 రూపాయలు.

సిటిజన్ షిప్‌ పొందేందుకు అదే రూటు

విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలో ఉండాలనుకుంటే ఈ వీసాను కొనుక్కోవచ్చు. ఈ వీసా తీసుకుంటే అక్కడ గ్రీన్ కార్డు పొందేందుకు, శాశ్వత నివాసం పొందేందుకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న EB-5 వీసా విధానం 1990 ప్రాంతంలో తీసుకొచ్చారు. ఇది విదేశీ ఇన్వెస్టర్లు అమెరికాలో సిటిజన్ షిప్‌ పొందేందుకు  ఉద్దేశించింది. అయితే ఈ కార్డు పొందాలనుకునేవారు  ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలిగి ఉండాలి. ఉపాధికల్పనకు సంబంధించి మూలధన పెట్టుబడులు పెట్టే వారై ఉండాలి. ఆర్ధికంగా దెబ్బ తిన్న ప్రాంతాల కోసం కనీస పెట్టుబడిగా కోటీ 50 లక్షల డాలర్లయినా పెట్టగలగాలి. అయితే ఈ ప్రోగ్రామ్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. లోపభూయిష్టంగా, మోసాలకు గురయ్యే వ్యాపారాలు చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. సాక్షాత్తు ట్రంప్‌ కుటుంబమే ఈవిధానంతో అక్రమ వ్యాపారాలు చేస్తోందన్న ఆరోపణలొచ్చాయి.

గోల్డ్ కార్డు తీసుకుంటే గ్రీన్ కార్డు సౌకర్యాలన్నీ కల్పిస్తుందని అమెరికా సిటిజన్ షిప్‌ పొందడానికి తమ దేశంలోకి వచ్చే ఎంట్రీ విధానమని ట్రంప్‌ అన్నారు. అమెరికాలో ఉండాలనుకున్న వారంతా ఈ కార్డు కొని అడుగు పెట్టాల్సిందేనన్నారు. ఈ ప్రోగ్రాం తదుపరి వివరాలను రెండు వారాల్లో ప్రకటిస్తామన్నారు. రష్యాలో అధికారాన్ని ప్రభావితం చేసే వ్యాపార సామ్రాజ్యవేత్తలు, ఈ కార్డు పొందేందుకు అర్హులా అన్న విలేకర్ల ప్రశ్నలకు..ట్రంప్ అవునని అన్నారు. వారిలో కూడా  మంచి వారు కూడా ఉంటారుకదా అని బదులిచ్చారు.

ఈ మార్పు ఎందుకంటే…

ప్రస్తుతం ఉన్న EB-5 వీసా విధానం పరమ చెత్తదని, అన్ని అబద్ధాలతోకూడినదని పైగా ధర కూడా చాలా తక్కువగా ఉందని ట్రంప్‌ కామర్స్ సెక్రటరీ హొవార్డ్ లుత్నిక్ అన్నారు. అందుకే ఆ కార్డును తొలగించి దాని స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డు పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు. EB-5 వీసా ప్రోగ్రామ్ ను అమెరికన్ కాంగ్రెస్ 1990లలో తీసుకు వచ్చింది. అమెరికా ఆర్ధిక అభివృద్ధిని పెంచేలా ఉద్యోగాల కల్పనకు, విదేశీ ఇన్వెస్టర్లు మూలధన పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించింది. EB-5 ప్రోగ్రాం కూడా ఇమ్మిగ్రంట్లు అక్కడ వెనుకబడిన ప్రాంతాలకు సాయంగా కోటీ 50 లక్షల డాలర్ల పెట్టుబడులు పెడితే వారికి గ్రీన్ కార్డు సౌకర్యం కల్పిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com