దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది కథానాయికలను అందించిన కేరళ నుంచి వచ్చిన సంయుక్త మీనన్… 2016లో మలయాళ సినిమా ‘పాప్‌కార్న్’ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటించింది. 1995లో కేరళలోని పాలక్కడ్ లో పుట్టిన సంయుక్త…సోషల్ మీడియాలో సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేసింది.
నటనలోనే కాదు చదువులోను టాప్ సంయుక్త మీనన్. పాలక్కడ్ సమీపంలోని తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. త్రిసూర్లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది.
టాలివుడ్ లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో తెలుగులోకి వచ్చిన సంయుక్త… 2022లో విడుదలైన భీమ్లా నాయక్ తో అందరినీ ఆకట్టుకుంది. సార్, విరూపాక్ష తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
మలయాళ కుట్టి తెలుగులో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగించాయి. దీంతో తెలుగులో మీడియం రేంజ్ హీరోలకు మంచి చాయిస్ గా మారింది సంయుక్త మీనన్.
చూడగానే జూనియర్ సమంతగా అనిపించే సంయుక్త మీనన్.. తెలుగులో అవకాశాలు వస్తున్నా స్టార్ హీరోయిన్ స్థాయికి ఇంకా చేరుకోలేదనే చెప్పుకోవాలి.
మహారాగ్ని హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన సంయుక్త మీనన్… కాజోల్ దేవ్‌గణ్, ప్రభుదేవాలతో కలిసి ముఖ్యపాత్రలో నటిస్తోంది. తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహారాగ్ని’ తో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది.
అందరి మాదిరిగానే బాలీవుడ్ మీద కన్నేసిన సంయుక్త మీనన్ తనెంటో నిరూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెపుతోంది. చీరకట్టులో పోజులిచ్చి సంక్రాంతి సందడి చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.