ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతులను ఆసాంతం సభలో చదివి వినిపించారు. అంతకుముందే కేబినెట్‌లో బడ్జెట్ 2025-26కి ఆమోదం లభించింది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఈ సందర్భంగా బడ్జెట్ స్వరూపాన్ని సభలో సభ్యుల ముందుంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేత పత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించామన్నారు. క్లిష్ట పరిస్ఠితుల్లో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రూ.23,500 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. రూ.2,790 కోట్లను మున్సిపాలిటీలకు చెల్లించామని వెల్లడించారుఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. ఏకంగా రూ.10 కోట్ల నిధులు కేటాయించామని పయ్యావుల కేశవ్ సభలో తెలిపారు. ఏపీ బడ్జెట్‌లో ఆయా రంగాలకు కేటాయింపులను వివరంగా చూద్దాం…
ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు :
- పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు.
- బిసి సంక్షేమానికి రూ.23,260 కోట్లు.
- వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు.
- పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కు రూ.18,848కోట్లు.
- జలవనరుల అభివృద్ది శాఖకు రూ.18,020 కోట్లు.
- మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.13,862 కోట్లు.
- విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు.
- వ్యవసాయానికి రూ.11,636 కోట్లు.
- సాంఘిక సంక్షేమం రూ.10,909 కోట్లు.
- ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు.
- రవాణా శాఖకు రూ.8,785 కోట్లు.
- తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు.
- అమరావతి నిర్మాణానికి రూ.6000 కోట్లు.
- ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు.
- తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు.
- పరిశ్రమలు వాణిజ్యంకు రూ.3,156 కోట్లు.
- యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు.
- పోలవరానికి రూ.6,705 కోట్లు.
- ఎస్సీ సంక్షేమానికి రూ.20,281 కోట్లు.
- ఎస్టీ సంక్షేమానికి రూ.8,159 కోట్లు.
- అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు.
- ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు.
- ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు.
- మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు.
- ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు.
- మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు.
- తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు.
- దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు .
- జల్‌జీవన్ విషన్‌కు రూ.2,800 కోట్లు
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు.
- పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు.
- స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు రూ.1,228 కోట్లు.
- మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగులకు రూ.4,332 కోట్లు.
- వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు.
- ఆర్ అండ్ బీకి రూ.8,785 కోట్లు.
- నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు.
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు.
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు.
- ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు.
- ITI, IITల కోసం రూ.210 కోట్లు.
- దీన్‌దయాళ్ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు.
- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు.
- పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు.
- చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు.
- RTGSకు రూ.101 కోట్లు.
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు.
- అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు.
- బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు.
- ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు.