29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

దైవానుగ్రహానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం

లక్షన్నర మంది భక్తులు, 6 వేల బస్సులు, లక్షకు పైగా విద్యార్థులు… లెక్కలేనన్ని కార్లు… ఇంత మంది ఒక్క చోట జమకూరినా ఒక్క అవాంఛనీయ సంఘటన జరకుండా… పోలీసులకు వీసమెత్తు పనికలగకుండా అత్యంత క్రమశిక్షణతో ఒక కార్యక్రమం జరిగిందంటే అది ఖచ్చితంగా దైవ కార్యక్రమమే అయ్యింటుంది. అందునా శృంగేరి జగద్గురువురుల దైవ సంకల్పమే అవుతుంది. దక్షిణామ్నాయ పీఠం శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గురువర్యుల సత్ సంకల్పంతో వర్షాల నుంచి నాలుగు రోజుల విరమాం కోసం మూడు కోట్ల 50 లక్షల శివనామ కీర్తనలు ఆలపించారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలు ఎదరు కాకుండా, అంతమందిలో గదరగోళం తలెత్తకుండా అత్యంత సాఫీగా జరిగిపోయింది. అంత మంది భక్తులు ఒకచోట చేరి శివనామ కీర్తనలు చేస్తుంటూ భక్తి భావంతో ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. సుమారు ఐదు వేల మంది వాలంటర్లీ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులు ప్రతి ఒక్కరికీ పాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. కేవలం దైవబలం వల్లే విశ్వజనీన క్షేమం కోసం సాగే ఈ మహా శివనామ సంకీర్తన క్రతువు సజావుగా సాగడానికి కారణమయ్యిందని జగద్గురువులు అభిభాషించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com