అఫ్ఘాన్ విక్టరీ… ఇంగ్లండ్ ఇంటికి…
ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. పసికూనలని భావించే అఫ్ఘానిస్థాన్.. తాము పసికూనలం కాదు.. పంజా విసిరే పులులమని ప్రూవ్ చేసుకున్నారు. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించారు. దీంతో అవమానంతో ఇంగ్లండ్ ఇంటి బాట పట్టింది.
నిజానికి అఫ్ఘాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. 177 పరుగులుతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకపడ్డాడు జాద్రాన్.
ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తాము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగానే ఆడింది. నిజానికి గెలిచినంత పని చేసింది. చాలా ఏళ్ల తర్వాత జో రూట్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. 111 పరుగులతో చెలరేగిపోయాడు. డకెట్, బట్లర్, ఒవెర్టన్, హ్యారీ బ్రూక్.. వీరిలో ఏ ఒక్కరైనా మరికాసేపు క్రీజులో ఉన్నా మ్యాచ్ టన్న్ అయ్యారు. కానీ అజ్మతుల్లా వారికి ఆ చాన్స్ ఇవ్వలేదు. ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్లకు తిప్పలు తప్పలేదు.
ఇక మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. చివరి ఆరు బంతులకు 13 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు అది సాధించలేకపోయారు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో అఫ్ఘాన్ టీమ్ సంబరాలు చేసుకోవడం ప్రారంభించింది. మరో బాల్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అవ్వగా.. గ్రూబ్ బీ నుంచి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది అఫ్ఘానిస్థాన్.