రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న ఐదు రూపాయల బిళ్ళలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వాటి స్ధానంలో పలుచగా ఉండే కొత్త ఐదు రూపాయల బిళ్ళలను రిజర్వ్ బ్యంక్ చలామణిలోకి తీసుకొస్తోంది. మందం ఎక్కువగా ఉన్న ఐదు రూపాయల కాయిన్స్ బంగ్లాదేశ్ కు ఎక్కువగా స్మగ్లింగ్ అవుతున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఇలా స్మగ్లింగ్ చేసుకున్న ఐదు రూపాయల బిళ్ళలను బంగ్లాదేశ్ లో కరిగించి నాలుగు నుంచి ఐదు బ్లేడ్లను తయారు చేస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ లో ఒక్కో బ్లేడు రెండు రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఐదు రూపాయల కాయిన్ పై పది రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో భారత్ లో చలామణిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్స్ అధిక శాతం మాయమై బంగ్లాదేశ్ లో తేలుతున్నాయి. ఈ కారణంగా మందంగా ఉండే పాత ఐదు రూపాయల కాయిన్స్ స్ధానంలో పలుచగా ఉండే ఐదు రూపాయల కాయిన్స్ ను రిజర్వ్ బ్యాంక్ త్వరలో విడుదల చేయనుంది.