29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

భారత వైమానిక దాడులకు నేలమట్టమైన ఉగ్ర శిబిరాలు ఇవే

పహల్గామ్‌ లోయలో అమాయక పర్యాటకులను అన్యాయంగా  కాల్చి చంపిన ప్రతిఫలం పాకిస్తాన్‌ ఇప్పుడు అనుభవిస్తోంది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులపై భారత వైమానిక దళం కోలుకోలేని దాడులు చేసి నేలమట్టం చేసింది. బుధవారం వేకువ జామున సుమారు 1.45 గంటల సమయంలో ప్రారంభించిన ఆపరేషన్‌ సింధూర్ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ తో పాటు పాకిస్తాన్‌ పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న 21 ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించారు. సవాయ్‌ నాలా, సయ్యద్‌ న బిలాల్‌, మస్కర్‌ ఎ అఖ్సా, చెలబండి, అబ్దుల్లా బిన్‌ మసూద్‌, దులాయ్‌, గర్హీ హబీబుల్లా, బత్రాసి, బాలాకోట్‌, ఓఘీ, బోయ్‌, సెన్సా, గుల్‌పుర్‌, కోట్లీ, బరాలి, డుంగీ, బర్నాల, మెహమూన జోయా, సర్జల్‌, మురిద్కె, బహవల్‌పుర్‌ ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేశారు. భారత్‌ కి అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర స్ధావరాలపై భారత్‌ వైమానిక దళం టార్గెట్‌ చేసింది. సరిహద్దుకు సరిగ్గా వంద కిలో మీటర్ల దూరంలో బహవల్‌పూర్‌ లో ఉన్న జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయాన్ని భారత వైమానిక దళం టార్గెట్‌ చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్‌ నేత మసూద్‌ అజహర్‌ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. అలాగే సాంబ ఎదురుగా సరిహద్దుకు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధకు చెందిన మురిడ్కే స్ధావరాన్ని కూడా పేల్చివేశారు. అదేవిధంగా పూంఛ్‌ రాజౌరీ ఎల్‌ఓసీకి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తంగ్ధర్‌ సెక్టార్‌ లోపల 30 కిలో మీటర్ల పరిధిలో సవాయ్‌ ఉన్న లష్కరే తోయిబా క్యాంపు, జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌, ఇదే రాజౌరీ నియంత్రణ రేఖకు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న బర్నాలా క్యాంప్‌, సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న జైషే మహ్మద్‌  సర్జల్ క్యాంప్,  అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్ లపై భారత్‌ వైమానిక దళలు ఆకస్మిక దాడులు జరిపి అన్ని ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com