30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

మహా కుంభమేళా పొడిగింపు లేదు… 26నే ముగింపు

మహా కుంభమేళా.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర ఘట్టం. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర పుణ్యస్నానాలు.. ఈ నెల 26తో ముగియనున్నాయి. ఇప్పటికే 55 కోట్లకు పైగా మంది స్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో కుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలన్న డిమాండ్లు పెరిగాయి. అధికారులు మాత్రం అది కుదరదని తేల్చిచెప్పారు. నిజానికి ఇప్పటికే కుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించారన్న ప్రచారం మొదలైంది. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది యూపీ ప్రభుత్వం.

కుంభమేళా ముహూర్తాన్ని పక్కాగా లెక్కించి పెట్టారు పండితులు. ఇందులో మార్పులు చేసే అవకాశం లేదని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా కలెక్టర్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ నెల 26తో కుంభమేళా ముగుస్తుందన్నారు ఆయన. .

కుంభమేళా ముగింపు దగ్గరికి వస్తుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటి వరకు వెళ్లని వారంతా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ బాటపడుతున్నారు. కొన్ని అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలు జరగడంతో కాస్త విమర్శలు వచ్చినా.. ఇన్ని కోట్ల మందిని హ్యాండిల్ చేయడంలో యూపీ సర్కార్ కృషిని కొట్టిపారేయలేం. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com