ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో భాగంగా పలు రకాల సెషన్స్, స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ది వండర్ మెంట్ టూర్’ పేరుతో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ లైవ్ కాన్సర్ట్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించారు.
ది యెలో డైరీ, అనుభా బజాజ్, రిడాయ్ లైవ్ ప్రదర్శనలతో మొదలైన ఈ సంగీత సంధ్య తర్వాత సుఖ్విందర్ సింగ్, జోనితా గాంధీ, ఏఆర్ అమిన్, జనై భోసలేతో పాటు.. చివరగా ఏఆర్ రెహమాన్ స్టేజీని ఊపేశారు. ‘జై హో’, ‘ఐరే తూఫాన్’, ‘జింగుచా’, ‘వందే మాతరం’ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
అర్ధరాత్రి మోహిత్ చౌహాన్, నటుడు ధనుష్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. రెహమాన్‌తో కలిసి లైవ్ షోలో పాల్గొన్నారు. శియామక్ డావర్ నృత్య రూపకాలు, రెహమాన్ సంగీతం కలిసి ముంబై ప్రేక్షకులకు మాయాజాలాన్ని చూపించిందీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్.