36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

గెలుపు మనదే.. సిరీస్‌ మనదే..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను చాలా గ్రాండ్‌గా ముగించింది టీమిండియా. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో ఘన విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది టీమిండియా. ఇక ఆఖరి మ్యాచ్‌లో అయితే అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌, టీమిండియా బౌలర్లు చెలరేగి పోవడంతో ఏకంగా 150 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచే చెలరేగిపోయింది. ఓపేనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. సంజూ ఔటైన తర్వాత ఆకాశమే హద్దుగా అన్నట్టుగా రెచ్చిపోయాడు అభిషేక్. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించాడు. కేవలం 54 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్స్‌లు కాగా.. ఏడు ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు 37 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రభంజనం సృష్టించాడు ఈ చిచ్చర పిడుగు.

మరోవై దూబే కూడా, తిలక్ వర్మ క్రీజులో కాసేపే ఉన్నా కూడా బ్యాట్‌కు పనిచెప్పారు. దూబే కేవలం 13 బంతులు ఆడి.. మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో కలిపి 30 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, రింకూసింగ్ నిరాశపరిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది టీమిండియా.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బౌలర్లు ధాటిగానే తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. మొదటి ఓవర్‌లోని మొదటి మూడు బాల్స్‌ను ఫోర్, ఫోర్, సిక్స్‌గా మలిచిన సాల్ట్‌ను కాస్త భయమేసినా.. ఆ తర్వాత తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు టీమిండియా బౌలర్లు. డకేట్ డకౌట్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ల పతనం ప్రారంభమైంది. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగినా అతడికి అండగా నిలవలేకపోయారు. హ్యారీ, లివింగ్ స్టోన్, బెతెల్ ఇలా అందరిని ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్‌కు పంపేశారు టీమిండియా బౌలర్లు.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ.. ఒక ఓవర్ వేసి రెండు వికెట్లు తీశాడు. దూబే కూడా రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్‌ చక్రవర్తి ఎప్పటిలాగానే తన మాయ చూపించి ఇద్దరిని ఔట్ చేశాడు. ఇక షమీ మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోయి బౌలింగ్ వేయడంతో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. దీంతో ఘన విజయం భారత్ సొంతమైంది.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరుణ్‌ చక్రవర్తికి దక్కగా.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ వరుణ్‌ చక్రవర్తి దక్కించుకున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com