కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడందరూ తండేల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తండేల్ ఈనెల 7వ తారీఖున రిలీజ్ కాబోతోంది. అసలు తండేల్ మూవీలోని స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. అంతే కాదు. ఈ మూవీ పై టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఐతే.. అవి నెరవేరతాయా లేదా.. ? అనే విషయాల్ని ఓసారి పరిశీలిద్దాం.
తండేల్ నాగ చైతన్య కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ. 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. పైగా చందూ, చైతూ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం. అందులోనూ లవ్ స్టోరీ లాంటి హిట్ తర్వాత సాయి పల్లవి, చైతూ కలసి నటిస్తున్న చిత్రం.
ఇవన్నీ తండేల్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఈ కథ కూడా కల్పిత కథ కాదు.
కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకుని దానికి ఓ లవ్ స్టోరీని జోడించి తయారు చేసిన స్టోరీ. అందుకోసం మూవీ టీమ్ చాలా కష్టపడింది. ముఖ్యంగా శ్రీకాకుళం యాస, ఆ గెటప్ కోసం నాగ చైతన్య చాలా శ్రమించాడు. సాయి పల్లవి కూడా శ్రీకాకుళం డిక్షన్ ని అవపోసన పట్టిందనే చెప్పాలి. ట్రైలర్, సాంగ్స్ ఇంటెన్సివ్ గా ఉండటంతో ఈ మూవీపై
బజ్ క్రియేట్ అయింది. ప్రమోషన్ విషయంలో కూడా మూవీ టీమ్ తగ్గేదేలే అన్నట్టు దూసుకెళుతుంది. ఐతే.. ఈ మూవీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా..? లేదా.. ? అనేదే
ప్రశ్న. పైగా హెవీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. అందులోనూ సంక్రాంతి సీజన్ ను వదిలేసి ఫిబ్రవరి నెలలో థియోటర్స్ లోకి వస్తోంది.
తండేల్ మూవీ టీమ్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. తండేల్ జాతర ఈవెంట్ ఘనంగా జరిగింది. సందీప్ రెడ్డి వంగా గెస్ట్ గా వచ్చాడు. పైగా తండేల్ మూవీని మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులకు అనిపించకపోతే.. నాపేరు మార్చుకుంటా అని డైరెక్టర్ చందూ మెండేటి గట్టి స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. చందూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గామారింది. మరి తండేల్ రిజల్ట్ ఎలా ఉంటుందో… వెయిట్ అండ్ సీ.