25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

తానాలో అవినీతి కంపు…!!

  • అమెరికన్ మార్టగేజ్ కంపెనీ కి బురిడీ..
  • అమెరికాలో తాకట్టుకి రుణాలిచ్చే ప్రభుత్వ కంపెనీ
  • కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్స్ గిఫ్ట్ స్కీమ్ దుర్వినియోగం
  • ఫాన్నీ మే సంస్థను తప్పుదోవ పట్టించిన ఉద్యోగులు
  • 700మందిని తొలగిస్తే అందులో 200 మంది తెలుగువారు
  • తానా, ఆటా సంస్థలకు డొనేషన్ ఇచ్చినట్లు రాసి సొమ్ముల క్లెయిమ్
  • దర్యాప్తులో తేలడంతో తొలగింపు
  • నైతిక నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు
  • అవినీతికి పాల్పడిన వారిలో తానా వైస్ ప్రెసిడెంట్‌
  • ఆటా మాజీ అధ్యక్షుని భాగస్వామి కూడా

అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద మార్టగేజ్ కంపెనీ (తాకట్టుకు రుణాలిచ్చే కంపెనీ) ఫాన్నీ మే (Fannie Mae) లో కుంభకోణం బయటపడింది. అయితే ఈ కుంభకోణం సూత్ర, పాత్ర ధారులు తెలుగు వారు కావడంతో దాదాపు 200 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు.డొనేషన్లకు సంబంధించి వారు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.అమెరికా ప్రభుత్వ మార్టగేజ్ సంస్థ అయిన ఫాన్నీ మే లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో నైతిక క్రమశిక్షణ కోల్పోయారన్న కారణంగా 200మందిని తొలగించాల్సివచ్చింది. జనవరి నెలలో యాపిల్‌ సంస్థ కార్యాలయమైన కుపర్టినోలో ఉన్న ఉద్యోగుల్లో 50 మంది తమ కాంపెన్సేషన్ పెంచుకునేందుకు అవినీతికి పాల్పడినట్లు తేలింది. దాంతో వారందరినీ కూడా ఉద్యోగాల్లోంచి తొలగించారు. అయితే ఈ తొలగింపులను ప్రశ్నించిన ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ మెన్ దీనిపై దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. ఫాన్నీ మే సంస్థ దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. తొలగింపుకు గురైన వారంతా ఫెడరల్‌ నేషనల్‌ మోర్టగేజ్ అసోసియేషన్ ఫాన్నీ మే సంస్థ లోని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయులే.ఫాన్నీ మే సంస్థ అమెరికాలోనే కుప్పలు తెప్పలుగా ఆస్తులున్న ఏకైక అతిపెద్ద సంస్థ. తొలగింపుకు బలైన 200 మంది ఇందులోని ఉద్యోగులే. సంస్థలో అక్రమాలు జరుగుతున్నట్లు తేలడం, అదీ కాక సంస్థలో ఉద్యోగులను సంస్కరించి, పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో మొత్తం 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా అందులో ఉన్న 200మంది తెలుగువారే కావడం గమనార్హం.

ఫాన్నీ మే (Fannie Mae) సంస్థలో ఉన్నమ్యాచింగ్‌ గ్రాంట్స్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ను దుర్వినియోగం చేయడమేకాక, సంస్థ నైతిక నియమావళిని ఉల్లంఘించడమే వీరి తొలగింపుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ వారి జీతాలకు అనుబంధంగా ఇచ్చే స్కీము. ఈ మ్యాచింగ్‌ గిఫ్ట్ స్కీము కింద చందాలిచ్చే వారికి కంపెనీ మ్యాచింగ్‌ గ్రాంట్స్ రూపంలో కాంపెన్సేట్‌ చేస్తుంది.

డొనేషన్ల విషయంలో తేడా

ఉద్వాసన పలికిన ఉద్యోగులంతా కొన్ని నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్స్ తో కుమ్మక్కై ఈ అవినీతికి తెర లేపినట్లు తెలుస్తోంది. తెలుగు వారి ఐక్యతకు ఉద్దేశించిన తానా, ఆటా సంస్థలకు ఇచ్చే డొనేషన్ల విషయంలో వీరంతా తేడా చేసినట్లు,ఈ తెలుగు సంస్థలకు విరాళాలిచ్చినట్టుగా రికార్డుల్లో చూపినట్లు సమాచారం.

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ సమాచారం ప్రకారం ఉద్వాసనకు గురైన ఉద్యోగుల్లో కొందరు తెలుగు సంస్థ అయిన తానా తో కుమ్మక్కై ఫాన్నీ మే కంపెనీని మోసగించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.
తొలగింపుకు గురైన వారిలో తానా ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వ్యక్తి, ఆటా సంస్థ మాజీ అధ్యక్షుని భాగస్వామి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తానా సంస్థ ఒక్కటే ఈ అవినీతి కేసులో చిక్కుకోలేదని, ఇంకా అనేక సంస్థలపై దర్యాప్తు సాగుతోందనీ సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com