26 C
Hyderabad
Saturday, August 8, 2026

Live Video

spot_img

తెలుగు, కన్నడలో ట్రెండింగ్…. “డ్యూడ్” సాంగ్

యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న వినూత్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఏమిటో మాయ మంత్రమే… మది జింకలా పరిగెత్తేనే” పాట అటు కన్నడలో.. ఇటు తెలుగులో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నది. తెలుగులో ఎస్.పి.మనోహర్ రాసిన ఈ గీతాన్ని అభిషేక్ ఆలపించారు. ఎమిల్ మహమ్మద్ ఈ చిత్రానికి సంగీత సారధి.

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. “డ్యూడ్” నుంచి విడుదలైన తొలి గీతానికి అటు కన్నడలో… ఇటు తెలుగులో లభిస్తున్న అసాధారణ స్పందనకు చిత్ర కథానాయకుడు కమ్ దర్శకుడు తేజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. “శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష, రాజేశ్వరి” వివిధ రంగాలకు చెంది, ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com