28.5 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల

  • రాయగడ పరిధినుంచి విశాఖ కోస్టల్‌ రైల్వే జోన్ వేర్పాటు
  • విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్
  • డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్పు
  • ఈ డివిజన్ లో 410 కిలోమీటర్ల పరిధిని చేర్చిన అధికారులు
  • రాయగడ రైల్వే డివిజన్ పరిధి ఖరారు

ఏపి ప్రజల చిరకాల వాంఛ తీరబోతోంది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.వాల్తేరు డివిజన్ పేరును విశాఖ పట్నం డివిజన్ గా మారుస్తున్నారు. అలాగే విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సౌత్‌ కోస్టల్‌రైల్వే జోన్ పరిధి లోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి. రాయగడ రైల్వే డివజిన్ పరిధిని వేరు చేస్తూ ప్రత్యేకంగా వేరుగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. విశాఖ డివిజన్ లో 410 కిలోమీటర్ల పరిధిని చేర్చారు. అలాగే కొండపల్లి-మోటు మర్రి సెక్షన్ ను సికింద్రాబాద్‌ డివిజన్ పరిధినుంచి విడదీసి విజయవాడ డివిజన్ పరిధిలోకి రైల్వే మంత్రిత్వ శాఖ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కూటమి ప్రభుత్వం విజ్నప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com